News October 14, 2025

MHBD జిల్లా వ్యాప్తంగా లిక్కర్ షాప్‌లకు 124 దరఖాస్తులు

image

మహబూబాబాద్ జిల్లాలో లిక్కర్ షాప్‌లకు మొత్తం 124 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. మంగళవారం 11 దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉందని, ఈనెల 18తో గడువు ముగుస్తుందని సూచించారు. గతంలో కంటే ఇప్పుడు దరఖాస్తులు తగ్గుతున్నాయన్నారు.

Similar News

News October 15, 2025

ఇండో-అమెరికన్ ఆష్లీ టెల్లిస్ అరెస్ట్

image

ఇండో అమెరికన్ ఆష్లీ టెల్లిస్(64)ను వర్జీనియాలో అరెస్టు చేశారు. ఆయన US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నారు. ఆయన జాతీయ రక్షణకు సంబంధించి టాప్ సీక్రెట్స్ దొంగిలించారని, చైనా అధికారులను కలిశారని ఆరోపణలు ఉన్నట్లు US మీడియా పేర్కొంది. ఈయన ముంబైలో జన్మించారు. ఆష్లీ టెల్లిస్ విదేశాంగ విధాన నిపుణుడు, వ్యూహకర్త. అంతర్జాతీయ భద్రత, రక్షణ, ఆసియా వ్యూహాత్మక అంశాలపై విశేష ప్రావీణ్యం ఉంది.

News October 15, 2025

రామాయంపేట: ఇంట్లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఇంట్లో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి సదాశివనగర్ తండాలో మంగళవారం రాత్రి మున్యా(36) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News October 15, 2025

తిర్యాణి: యూట్యూబర్‌కు 14 రోజులు రిమాండ్

image

తిర్యాని మండలం మంగి పాతగూడకు చెందిన యూట్యూబ్ వెంకటేశ్‌కు ఆసిఫాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు తిర్యాణి ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. 3 రోజుల క్రితం యూట్యూబర్ వెంకటేశ్ ఓ సామాజిక వర్గాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పోస్టు వైరల్‌గా మారింది. సదరు వర్గానికి చెందిన నాయకులు అతడిపై పిర్యాదు చేయడంతో కోర్టు అతడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ వెల్లడించారు.