News October 14, 2025

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: ASF ఎస్పీ

image

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ASF ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో గ్రేవ్, నాన్ గ్రేడ్ పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News October 15, 2025

మగపిల్లలు పుట్టలేదని వ్యక్తి సూసైడ్

image

ఆదోని పరిధిలోని మదిరే వాసి గంపల సోమ(31) రైలు కిందపడి మంగళవారం మృతిచెందాడు. మగ పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇస్వీ ఆర్ఎస్ 501/18 సమీపంలో మధ్యాహ్నం గూడ్స్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 15, 2025

డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నేతలు

image

సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి రేసులో నారాయణఖేడ్ నియోజకవర్గ నేతలు కూడా ఉన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవి నియామకం కోసం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన జిల్లా ప్రణాళిక సంఘం మాజీ సభ్యుడు నగేష్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పేర్లకు పలువురు మద్దతు పలికారు.

News October 15, 2025

కామారెడ్డి: తల్లి ఆత్మహత్యకు కారణమైన కొడుకు అరెస్ట్

image

తల్లి మృతికి కారణమైన కసాయి కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI స్రవంతి తెలిపారు. పోలీసుల వివరాలు.. దోమకొండకు చెందిన చింతల సాయిలు తన తల్లి లక్ష్మవ్వ(70)కు సరిగా తిండి పెట్టకుండా వేధింస్తూ, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మవ్వ మృతికి ఆమె కొడుకే కారణమని నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.