News October 14, 2025

కరీంనగర్: ష్.. గప్ చుప్.. గ్రామాలన్నీ సైలెంట్

image

మొన్నటి వరకు ఉమ్మడి KNRజిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ‘అన్న నేను సర్పంచ్‌కు నిల్సుంటున్న. తమ్ముడు నీ ఓట్ నాకే వేయాలి’ అని సర్పంచ్ ఆశావాహులు చిన్నపాటి ప్రచారం చేశారు. కొందరైతే దసరా దావత్‌లు కూడా ఇచ్చారు. ఇటీవల స్థానికసంస్థల ఎన్నికల రిజర్వేషన్స్‌పై HC స్టే ఇవ్వడంతో వారి ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది. గ్రామాల్లో ప్రచార సందడి తప్పి సైలెంట్‌గా మారింది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేవరకు ఇదే పరిస్థితి ఉండొచ్చు.

Similar News

News October 15, 2025

శ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు

image

AP: రేపు <<17979325>>PM మోదీ<<>> శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. 1800మంది పోలీసులు, సిబ్బందితో మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రేపు ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. భక్తులు దీనికి తగిన విధంగా తమ ప్లాన్స్ మార్చుకోవాలని జిల్లా కలెక్టర్, SP సూచించారు.

News October 15, 2025

ఓయూ రిజిస్ట్రార్‌కు ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు

image

ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డికి ‘బెస్ట్ రీసెర్చ్ పేపర్’ అవార్డు లభించింది. ద ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్(ఐఏఏ) నిర్వహించిన 47వ ఆల్ ఇండియా అకౌంటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జనార్దన్ రాయ్ నగర్ రాజస్థాన్ విద్యాపీఠ్(డీమ్డ్ యూనివర్సిటీ)లో ఈనెల 12, 13 తేదీల్లో ఈ సదస్సు జరిగింది.

News October 15, 2025

తిరుమల నుంచి 187 మంది తరలింపు

image

తిరుమలలో యాచకులు, అనాధికారిక హాకర్ల పై టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖ మూడు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 187 మందిని గుర్తించి తిరుమల నుంచి కిందకి తరలించారు. వివిధ ప్రాంతాలను భక్తుల కోసం శుభ్రపరిచారు. హోటల్స్, టీ షాపులు వద్ద పారిశుద్ధ్యం పై సూచనలు చేశారు.