News October 14, 2025

ప్రపంచ స్థాయిలోగుర్తింపు.. అందని హామీలు..!

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తి ప్రపంచ స్థాయిలో రాణిస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రపంచ పారా అథ్లెటిక్స్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. గతేడాది రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం రూ.కోటి నజరానా అందించారు. కానీ, గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం హామీగానే మిగిలిపోయింది.

Similar News

News October 15, 2025

కామారెడ్డి: DCC అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నారెడ్డి మోహన్ రెడ్డి

image

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రామారెడ్డి జడ్పీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారెడ్డి మోహన్ రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా అబ్జర్వర్ రాజ్ పాల్‌కు దరఖాస్తును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆపత్కాలంలో పార్టీకి ఎనలేని సేవలు చేశానని, తన సేవలను గుర్తించి డీసీసీ పదవి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 15, 2025

మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం: ఉత్తమ్

image

TG: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తితే 1800-425-00333/1967 హెల్ప్ లైన్ నంబర్‌కి ఫోన్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లో నగదు చెల్లింపు చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. ఈ సీజన్‌లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు. మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

News October 15, 2025

సికింద్రాబాద్‌లో టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్

image

సికింద్రాబాద్‌లోని AOC సెంటర్‌లోని థాపర్ స్టేడియంలో NOV 15 నుంచి DEC 1వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. 110 ఇన్ఫాంట్రీ బెటాలియన్( టెరిటోరియల్ ఆర్మీ), 117 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్, 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ది గార్డ్స్‌లో సైనికుల కోసం ఈ ర్యాలీ జరుగుతుంది. టెన్త్ పాసై శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు https://www.ncs.gov.in/ను సంప్రదించవచ్చు.