News April 8, 2024
మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్యాలు

HYD మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఒడిసి, మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలు అలరించాయి. నిర్మల్య డాన్స్ స్కూల్ గురువు దేబస్రి పట్నాయక్ శిష్య బృందం ఒడిసి నృత్య ప్రదర్శనలో బట్టు నృత్య, పల్లవి, మోక్ష, మొదలైన అంశాలను, డా.మైథిలి అనూప్ శిష్య బృందం మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలో శ్లోకాలు, నవరసాంజలి, జతిస్వరం, కీర్తనం, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
Similar News
News September 10, 2025
పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.
News September 10, 2025
HYD: ‘తొలి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ’

తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అని HYD జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పళని అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని నాంపల్లిలోని కలెక్టరేట్‌లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పళని, DRO వెంకటచారితో కలిసి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News September 10, 2025
HYD: కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర: మంత్రి

జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినా లాభం లేదని, ప్రభుత్వం మారదని, ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు HYDలో KTR వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర సాధ్యమని, BRSఎన్నికల్లో బీరు-బిర్యానీ సంస్కృతి తెచ్చిందన్నారు. జూబ్లిహిల్స్‌లో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కూల్చింది KTR కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.