News October 14, 2025
16న శ్రీశైలం వచ్చే భక్తులకు ముఖ్య గమనిక

ఈనెల 16న శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులకు అధికారులు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, దోర్నాల మీదుగా శ్రీశైలం వచ్చే వారు తమ ప్రణాళికను సవరించుకోవాలన్నారు.
Similar News
News October 15, 2025
శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ రాజ్యం

శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం చూడాల్సిన చారిత్రక ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ రాజసాన్ని ప్రతిబింబించేలా భారీ బురుజులు, మధ్యలో కోట.. అందులో భారీ విగ్రహం వంటివి ఎన్నో ఉన్నాయి. శివాజీ 1677లో శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని సందర్శించి, ఆలయానికి ఉత్తరం వైపున ధ్యానం చేయడంతో ఆ ప్రదేశంలోనే ధ్యాన మందిరం నిర్మించారు. ఈ స్ఫూర్తి మందిరాన్ని ఈనెల 16న ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
News October 15, 2025
అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>
News October 15, 2025
పత్తి నాణ్యత బాగుండాలంటే.. ఇలా చేయండి

తెలుగు రాష్ట్రాల్లో పత్తి తీతలో రైతులు నిమగ్నమయ్యారు. పత్తి నాణ్యత బాగుంటేనే అధిక ధర వస్తుంది. పంటకు మంచి ధర దక్కాలంటే పత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడి, అందులో తేమశాతం తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. లేకుంటే గింజలు ముడుచుకుపోయి పత్తి తూకం తగ్గి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. పత్తిని నిల్వచేసే సంచులను శుభ్రంగా ఉంచాలి. వాటిలో దుమ్ము, ధూళీ లేకుండా చూస్తే పత్తి రంగు మారదు.