News October 14, 2025

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. మొత్తం 22 నామినేషన్లు

image

జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నామినేషన్‌ల స్వీకరణ కొనసాగుతోంది. మొదటి రోజున 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు దాఖలు చేయగా నేడు(2వ రోజు) 11 మంది అభ్యర్థులు 11 నామినేషన్‌లు సమర్పించారు. రెండు రోజుల్లో మొత్తంగా 22 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 నుంచి 21 వరకు కొనసాగనుంది.

Similar News

News October 15, 2025

టీనేజర్ల కోసం ఇన్‌స్టాలో కొత్త రూల్స్!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే PG-13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా టీనేజ్ యూజర్లకు కంటెంట్‌పై రెస్ట్రిక్షన్స్ విధించనుంది. ఆటోమేటిక్‌గా 18 ఏళ్లలోపు యూజర్లను 13+ కేటగిరీ సెట్టింగ్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పిల్లలు దానిని ఛేంజ్ చేయలేరు. డ్రగ్స్ వాడకం, అడల్ట్, హింసాత్మక కంటెంట్‌లను వారికి చూపించదు.

News October 15, 2025

శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ రాజ్యం

image

శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం చూడాల్సిన చారిత్రక ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ రాజసాన్ని ప్రతిబింబించేలా భారీ బురుజులు, మధ్యలో కోట.. అందులో భారీ విగ్రహం వంటివి ఎన్నో ఉన్నాయి. శివాజీ 1677లో శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని సందర్శించి, ఆలయానికి ఉత్తరం వైపున ధ్యానం చేయడంతో ఆ ప్రదేశంలోనే ధ్యాన మందిరం నిర్మించారు. ఈ స్ఫూర్తి మందిరాన్ని ఈనెల 16న ప్రధాని మోదీ సందర్శించనున్నారు.

News October 15, 2025

అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

image

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>