News October 14, 2025

‘స్కాలర్‌షిప్స్ రాలేదు.. జీతాలు ఇవ్వలేం’

image

TG: ఉన్నత విద్యాసంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు నిలిపివేశాయి. దాదాపు 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌లు విడుదల కాలేదని, వచ్చిన తర్వాతే ఇస్తామని తేల్చి చెబుతున్నాయి. ఇప్పటికే 50% కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం Way2Newsకు గోడు వెల్లబోసుకుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది అడ్మిషన్లూ కష్టమని ఆందోళన వ్యక్తం చేసింది.

Similar News

News October 15, 2025

టీనేజర్ల కోసం ఇన్‌స్టాలో కొత్త రూల్స్!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే PG-13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా టీనేజ్ యూజర్లకు కంటెంట్‌పై రెస్ట్రిక్షన్స్ విధించనుంది. ఆటోమేటిక్‌గా 18 ఏళ్లలోపు యూజర్లను 13+ కేటగిరీ సెట్టింగ్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పిల్లలు దానిని ఛేంజ్ చేయలేరు. డ్రగ్స్ వాడకం, అడల్ట్, హింసాత్మక కంటెంట్‌లను వారికి చూపించదు.

News October 15, 2025

అదుపు తప్పిన మనసుకు మార్గదర్శనం ‘వేదం’

image

వేదం వైరాగ్యాన్ని బోధించదు. అది అదుపు తప్పే మానవ హృదయాలను ధర్మమార్గంలో నడిపిస్తుంది. అందుకే వేదాన్ని దివ్య జ్ఞాన సంపదగా పండితులు చెబుతారు. వేదంలో జీవిత పరమార్థం, ఆనందం, శాంతి సౌభాగ్యాల కోసం పవిత్రమైన ఆకాంక్ష నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వేదసారం సర్వమానవాళికి అందుబాటులోకి రావాలని వేదమే ఉద్ఘాటించింది. సత్యమైన జీవితాన్ని, సంతోషాన్ని పొందడానికి వేదం మార్గదర్శకమని గ్రహించాలి. <<-se>>#VedikVibes<<>>

News October 15, 2025

పత్తి నాణ్యత బాగుండాలంటే.. ఇలా చేయండి

image

తెలుగు రాష్ట్రాల్లో పత్తి తీతలో రైతులు నిమగ్నమయ్యారు. పత్తి నాణ్యత బాగుంటేనే అధిక ధర వస్తుంది. పంటకు మంచి ధర దక్కాలంటే పత్తి తీయగానే నీడలో మండెలు వేయాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడి, అందులో తేమశాతం తగ్గి పత్తి శుభ్రంగా ఉంటుంది. లేకుంటే గింజలు ముడుచుకుపోయి పత్తి తూకం తగ్గి, నాణ్యత దెబ్బతినే ఛాన్సుంది. పత్తిని నిల్వచేసే సంచులను శుభ్రంగా ఉంచాలి. వాటిలో దుమ్ము, ధూళీ లేకుండా చూస్తే పత్తి రంగు మారదు.