News October 14, 2025

TIDCOకు అప్పుగా ₹300 కోట్ల నిధులు

image

AP: టిడ్కో ఇళ్ల బిల్లుల చెల్లింపునకు ₹300 కోట్ల రుణం మంజూరుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రాజీవ్ స్వగృహ నుంచి ₹200 కోట్లు, APUFIDC నుంచి ₹100 కోట్లు టిడ్కోకు ఇవ్వాలని ఆదేశించింది. కాగా టిడ్కో ఇళ్లకోసం హడ్కో ₹4450 కోట్లు మంజూరు చేసినప్పటికీ ప్రభుత్వం, లబ్ధిదారుల వాటా నిధుల ఆలస్యం వల్ల చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. ₹450 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నట్లు టిడ్కో ప్రభుత్వానికి తెలిపింది.

Similar News

News October 15, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రెండ్రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు కనుమరుగయ్యే ఛాన్సుందని IMD పేర్కొంది. ఇప్పటికే ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి నిష్క్రమించినట్లు తెలిపింది. ఇదే టైమ్‌లో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ప్రవేశిస్తాయంది. ఉపరితల ఆవర్తనాలతో పలు జిల్లాల్లో రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నేడు TPT, NLR, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.

News October 15, 2025

1289 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ విభాగంలో 1,289 హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, PE, MT/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్, 2025/జనవరి, 2026లో నిర్వహించనున్నారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/

News October 15, 2025

టీనేజర్ల కోసం ఇన్‌స్టాలో కొత్త రూల్స్!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే PG-13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా టీనేజ్ యూజర్లకు కంటెంట్‌పై రెస్ట్రిక్షన్స్ విధించనుంది. ఆటోమేటిక్‌గా 18 ఏళ్లలోపు యూజర్లను 13+ కేటగిరీ సెట్టింగ్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పిల్లలు దానిని ఛేంజ్ చేయలేరు. డ్రగ్స్ వాడకం, అడల్ట్, హింసాత్మక కంటెంట్‌లను వారికి చూపించదు.