News October 14, 2025
పార్వతీపురం కలెక్టర్‌కు అరుదైన గౌరవం

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)నుంచి అరుదైన గౌరవం లభించింది. ఈనెల 27,28వ తేదీల్లో ముస్సోరిలో కలెక్టర్లకు శిక్షణ కోసం NAKSHA కార్యక్రమంపై నిర్వహించే రెండు రోజుల శిక్షణ, వర్క్ షాప్‌నకు రావాలని ప్రభాకరరెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు కలెక్టర్లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు.
Similar News
News October 15, 2025
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని శవం

రేణిగుంట అగ్రహారం రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాలు వరకు ఉంటుందని చెప్పారు. వెంకటాపురం పంచాయతీ వీఆర్వో రామ్ చరణ్ తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఛామనఛాయ రంగు, గీతల ఫుల్ షర్టు నీలం రంగు లొంగి ధరించి ఉన్నాడని అన్నారు. మృతుని వివరాలు తెలిస్తే రేణిగుంట పోలీసులను సంప్రదించాలని కోరారు.
News October 15, 2025
విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా

AP: విజయవాడలో విద్యుత్ సంఘాల నేతలతో CS విజయానంద్, విద్యుత్ CMDల చర్చలు ముగిశాయి. సమస్యలకు సంబంధించి కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కొచ్చాయని JAC నేత కృష్ణయ్య పేర్కొన్నారు. ‘కొన్ని అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధాని మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఈ నెల 17న మ.3 గం.కు మళ్లీ చర్చలకు హాజరవుతాం. అప్పుడు సమ్మెపై నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.
News October 15, 2025
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మందాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.