News October 14, 2025
కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వట్లేదు: BCCI VP

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్ కాబోతున్నారని, ఆస్ట్రేలియా సిరీసే చివరిదని జరుగుతున్న ప్రచారాన్ని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ‘రోహిత్, కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాను ఓడించడంలో వారు కీలకం. రిటైర్మెంట్ ప్లేయర్ల ఇష్టం. కానీ ఇది వారి చివరి సిరీస్ మాత్రం కాదు. అలాంటి ఆలోచన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News October 15, 2025
రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఇవాళ, రేపు జరగాల్సిన FA-2 పరీక్షలు 17, 18న నిర్వహించుకోవాలని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు సూచించారు.
News October 15, 2025
నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు

నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. స్వామి నైవేద్యం కోసం వండిన పదార్థాన్ని విడిగా తీసి పెట్టకుండా, పెట్టే పాత్రలో నిండుగా ఉంచాలి. నైవేద్య నివేదన తర్వాత నీళ్లు పెట్టడం అస్సలు మరవొద్దు. వీలైనంత ఎక్కువ సమయం నైవేద్యాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచడం శుభకరం. నైవేద్య పదార్థాలలో బెల్లంతో వండిన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం శ్రేయస్కరం. ఈ నియమాలు భక్తిని, శుచిని తెలియజేస్తాయి. <<-se>>#POOJA<<>>
News October 15, 2025
వైద్యశాఖకు రూ.500 కోట్లు విడుదల: సీఎం

TG: వైద్యారోగ్య శాఖకు తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రక్షాళన చేయాలన్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో ఆయన నివాసంలో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. టిమ్స్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాల వ్యయంపై ఆరా తీశారు. మరోవైపు సీఎం ఇవాళ హన్మకొండలో పర్యటించనున్నారు.