News October 14, 2025
GWL: తెలంగాణ రైజింగ్ విజన్‌లో ఉద్యోగులు పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణని అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రూపొందిస్తున్న ‘తెలంగాణ రైజింగ్- 2047’ డాక్యుమెంట్ రూపకల్పనలో ఉద్యోగులు పాల్గొనాలని గద్వాల కలెక్టర్ సంతోష్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు ఈ సర్వే అక్టోబర్ 10న ప్రారంభమైందని తెలిపారు. ఉద్యోగులు, పౌరులు పాల్గొని విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News October 15, 2025
HYD: ఎదలోతులో.. ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు..

90‘sలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మనాన్న ఇచ్చిన ఆటానా, చారాణా మనకెంతో గొప్ప. వాటితో స్కూలు గేటు ముందు చాక్లెట్లు, నారింజ మిఠాయి, కొబ్బరుండలు కొనుక్కొని షర్ట్ అడ్డుపెట్టి కొరికి స్నేహితులతో పంచుకునేవాళ్లం. బాల్యంలో చేసినవి గుర్తొస్తే కళ్లవెంబడి నీళ్లొస్తాయి కదా? అబ్దుల్లాపూర్‌మెట్‌లోని RNR కాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద పిల్లలు గేట్ ముందు కొనుక్కుంటూ కనిపించారు. స్కూల్ లైఫ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్.
News October 15, 2025
రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఇవాళ, రేపు జరగాల్సిన FA-2 పరీక్షలు 17, 18న నిర్వహించుకోవాలని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు సూచించారు.
News October 15, 2025
కామారెడ్డి: తల్లి ఆత్మహత్యకు కారణమైన కొడుకు అరెస్ట్

తల్లి మృతికి కారణమైన కసాయి కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI స్రవంతి తెలిపారు. పోలీసుల వివరాలు.. దోమకొండకు చెందిన చింతల సాయిలు తన తల్లి లక్ష్మవ్వ(70)కు సరిగా తిండి పెట్టకుండా వేధింస్తూ, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మవ్వ మృతికి ఆమె కొడుకే కారణమని నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.