News October 14, 2025

పెద్దపల్లి: ఆశా నోడల్ సూపర్వైజర్‌ల సమీక్ష సమావేశం

image

PDPL DMHO డా. వాణిశ్రీ అధ్యక్షతన ఆశా నోడల్ సూపర్వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణీను తొలి 3 నెలల్లోనే నమోదుచేసి, అన్ని పరీక్షలు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవల వినియోగం, “102” వాహన సేవల ప్రాముఖ్యతను వివరించారు. క్షయ, మధుమేహం, రక్తపోటు స్క్రీనింగ్‌లు నిర్వహించి మందులు అందించాలన్నారు. సమావేశంలో CPR ప్రదర్శనతోపాటు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు.

Similar News

News October 15, 2025

HYD: ఎదలోతులో.. ఏమూలనో నిదురించు జ్ఞాపకాలు..

image

90‘sలో స్కూలుకు వెళ్లేటప్పుడు అమ్మనాన్న ఇచ్చిన ఆటానా, చారాణా మనకెంతో గొప్ప. వాటితో స్కూలు గేటు ముందు చాక్లెట్లు, నారింజ మిఠాయి, కొబ్బరుండలు కొనుక్కొని షర్ట్ అడ్డుపెట్టి కొరికి స్నేహితులతో పంచుకునేవాళ్లం. బాల్యంలో చేసినవి గుర్తొస్తే కళ్లవెంబడి నీళ్లొస్తాయి కదా? అబ్దుల్లాపూర్‌మెట్‌లోని RNR కాలనీ ప్రభుత్వ పాఠశాల వద్ద పిల్లలు గేట్ ముందు కొనుక్కుంటూ కనిపించారు. స్కూల్ లైఫ్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్.

News October 15, 2025

రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఇవాళ, రేపు జరగాల్సిన FA-2 పరీక్షలు 17, 18న నిర్వహించుకోవాలని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు సూచించారు.

News October 15, 2025

కామారెడ్డి: తల్లి ఆత్మహత్యకు కారణమైన కొడుకు అరెస్ట్

image

తల్లి మృతికి కారణమైన కసాయి కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI స్రవంతి తెలిపారు. పోలీసుల వివరాలు.. దోమకొండకు చెందిన చింతల సాయిలు తన తల్లి లక్ష్మవ్వ(70)కు సరిగా తిండి పెట్టకుండా వేధింస్తూ, ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మవ్వ మృతికి ఆమె కొడుకే కారణమని నిర్ధారించి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.