News October 14, 2025
VKB: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలి

వికారాబాద్ జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్దతు ధర పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ చెప్పారు.
Similar News
News October 15, 2025
MBNR: PUలో 4వ స్నాతకోత్సవం.. నిబంధనలు ఇవే!

✒PhD అవార్డు, బంగారు పతక గ్రహీతలను మాత్రమే గ్రంథాలయం ఆడిటోరియంలోనికి అనుమతి
✒బంగారు పతక విజేతలు, తల్లిదండ్రులకు ప్రవేశ పాసులు జారీ
✒విద్యార్థుల తల్లిదండ్రులు, PU సిబ్బందికి, మేనేజ్మెంట్ సభ్యులకు ప్రత్యక్షంగా వీక్షేందుకు ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు
✒విద్యార్థులు, ఇతరులు ఇండోర్ కాంప్లెక్స్‌లో డిజిటల్ తెరపై చూసే వెసులుబాటు
✒ఫొటోలు, సెల్ఫీ పాయింట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
News October 15, 2025
సిద్దిపేట: ‘విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు’

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. నంగునూరు మం. బద్దిపడగ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న బోజనం అందించకపోవడం, పాఠాశాల పరిశుభ్రంగా లేకపోవడంతో హెచ్‌ఎంను సప్పెండ్ చేశారు. సిద్దిపేట(R) మం. తోర్నాల ZPHSలో కామన్ డైట్ మెనూలో భాగంగా మిక్స్‌డ్ వెజిటేబుల్ కూర, సాంబారు కాకుండా ఆలుటమాట కూర, పచ్చిపలుసు మాత్రమే పెట్టడంపై HM, సిబ్బందిపై చర్యలు ఆదేశించారు.
News October 15, 2025
ఇదేం పని స్వామీ.. గంజాయితో పట్టుబడ్డ పూజారి!

ఆలయంలో పనిచేసే పూజారి గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఘటన గుంతకల్లులో జరిగింది. హనుమాన్ సర్కిల్ వద్ద ఎక్సైజ్ పోలీసులు మంగళవారం గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 4kg గంజాయి, రవాణా కోసం ఉపయోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోహన్ సుందర్ పశ్చిమగోదావరి జిల్లా వ్యక్తి కాగా, ఆయన గుత్తి మండలంలోని ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.