News October 14, 2025

సంగారెడ్డి: ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం: మంత్రి

image

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో విద్యా అవకాశాల్లో సామాజిక న్యాయం సాధ్యపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఇంతకాలం ప్రొఫెషనల్ కోర్సుల్లో నామమాత్రంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్ల వర్గీకరణతో ఈ ఏడాది సముచిత ప్రాధాన్యం లభించిందన్నారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన పిల్లలకు కూడా ఈ ఏడాది మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు రావడం సంతోషమన్నారు.

Similar News

News October 15, 2025

నగరిలో దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే.?

image

గుణశీలన్(65) కుమారుడు <<18008874>>విజయ్‌ సూసైడ్ <<>>అనంతరం ఆయన పేరుపై ఉన్న రూ.1.25కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు నామినీగా ఉన్న తండ్రి ఖాతాకు జమ అయింది. రూ.10 లక్షలను గుణశీలన్ కౌసల్యకు ఇచ్చాడు. తన కూతురికి తక్కువ ఇచ్చాడని గంగాధరం కక్ష పెంచుకున్నాడు. మరో వ్యక్తి అయ్యప్పన్‌కు గుణశీలన్ రూ.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అతడు నగదు ఇవ్వకుండా మెండికేయడంతో గుణశీలన్ నిలదీశాడు. దీంతో ఇద్దరూ గుణశీలన్ను హత్య చేశారు.

News October 15, 2025

ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

image

IRCTC 16 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc హాస్పిటాలిటీ, BBA, MBA, BSc హోటల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల వారు ఈనెల 16, 17 తేదీల్లో కోల్‌కతాలోని IRCTC జోనల్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: www.irctc.com

News October 15, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న పుష్పయాగం. 29న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, 30న ఆర్జిత సేవలు రద్దు.
* రోగులు, క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు కొత్తగా 190 ‘108’ వాహనాలను అందుబాటులోకి తేనున్న రాష్ట్ర ప్రభుత్వం
* విజయనగరం జిల్లాలో JSW సంస్థ రూ.531.36 కోట్లతో 1166 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్ పార్క్‌కు ప్రభుత్వం అనుమతి