News October 14, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ సెమీస్ వెళ్లాలంటే?

SA, AUS చేతిలో ఓడిపోయిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెక్ట్స్ ఈనెల 19న ENG, 23న NZ, 26న బంగ్లాతో తలపడనుంది. బంగ్లా మినహా ENG, NZపై భారత రికార్డు పేలవంగా ఉంది. కానీ వీటితో చివరగా జరిగిన సిరీస్‌ల్లో INDనే పైచేయి(2-1) సాధించింది. లీగ్‌లో మిగిలిన 3 మ్యాచ్‌ల్లో గెలిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లే అవకాశముంది. లేదంటే కనీసం 2 గెలిచి, మెరుగైన NRR మెయింటెన్ చేస్తే క్వాలిఫై అవ్వొచ్చు.
Similar News
News October 15, 2025
కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

TG: తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను ప్రభుత్వం తొలగించింది. మంత్రుల మధ్య విభేదాలకు కారణమయ్యేలా సమాచారాన్ని లీక్ చేస్తున్నారని, మేడారం పనుల టెండర్లలోనూ గోల్‌మాల్‌కు యత్నించారని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. సెటిల్మెంట్లు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తీవ్రంగా స్పందించిన CM రేవంత్ ఆయనను తొలగించాలని నేరుగా ఆదేశించినట్లు సమాచారం.
News October 15, 2025
ఫార్మసీ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

AP: రాజమహేంద్రవరం పరిధిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 12 ఫార్మసీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డీ ఫార్మసీ/బీ ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు రీజినల్ మెడికల్& హెల్త్ కమిషనర్ ఆఫీస్‌లో సా. 5గం.లోపు దరఖాస్తు సమర్పించాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/
News October 15, 2025
టికెట్ లేని ప్రయాణం.. రూ.కోటి ఫైన్ వసూలు

టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై సౌత్ సెంట్రల్ రైల్వే కొరడా ఝుళిపించింది. జోన్ పరిధిలో సోమవారం చేసిన ప్రత్యేక తనిఖీల్లో 16వేల మంది దొరికారు. రోజూ ఫైన్లతో సగటున ₹47 లక్షలు వస్తే 13న SCR చరిత్రలో తొలిసారి ఒకేరోజు ₹1.08కోట్లు వసూలైంది. VJA డివిజన్: ₹36.91L, గుంతకల్లు: ₹28L, Sec-bad: ₹27.9L, GNT: ₹6.46L, HYD: ₹4.6L, నాందేడ్: ₹4.08L. టికెట్ లేని ప్రయాణాలకు ఫైన్, జైలు శిక్ష ఉంటాయని SCR హెచ్చరించింది.