News October 15, 2025

జగిత్యాల: రేపటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

image

జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి NOV 14 వరకు JGTL(D)లోని అన్ని గ్రామాల్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకోసారి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్‌లో 23 వేల కొత్త ఓట్లపై అనుమానం: BRS

image

జూబ్లీహిల్స్‌లో నకిలీ ఓట్ల వివాదం చిలిచిలికి గాలివానైంది. నకిలీ ఓట్ల విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా స్పందన లేదంటూ BRS సీరియస్ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు మెట్లు ఎక్కాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌ నియెజకవర్గంలో 23 వేల కొత్త ఓట్లు నమోదు కావడం అనుమానాస్పదమంటూ, దీనిపై చర్యలు తీసుకునేలా చేయాలని హైకోర్టును ఆశ్రయించనుంది.

News October 15, 2025

20 మంది మృతి.. పరిహారం ప్రకటించిన ప్రధాని

image

రాజస్థాన్‌లో జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు <<18008110>>దగ్ధమై<<>> 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

News October 15, 2025

సూర్యాపేట: రాయితీ సొమ్ము కోసం ఎదురుచూపులు..!

image

సూర్యాపేట జిల్లాలో లబ్ధిదారులకు అకౌంట్లలో రాయితీ జమ కావడం లేదు. ఐదారు నెలలుగా రాయి సొమ్ము రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 4 లక్షలకు పైనే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మహాలక్ష్మీ పథకం కోసం దాదాపు 3 లక్షలకు పైనే దరఖాస్తులు అందాయి. రాయితీ డబ్బులు పడితే తమకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని, ప్రభుత్వం స్పందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.