News October 15, 2025

గంభీరావుపేట: ‘ప్రజలకు చేరువగా పోలీస్ విధులు ఉండాలి’

image

ప్రజలకు చేరువగా పోలీస్ విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచించారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించారు. విలేజ్ పోలీస్ అధికారులు కేటాయించిన గ్రామాల్లో తరచూ పర్యటించి ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, రౌడీషీటర్లను తనిఖీ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News October 15, 2025

సైదాపూర్: బావిలో యువకుడి మృతదేహం లభ్యం

image

KNR(D) సైదాపూర్ మండలం గోడిశాల గ్రామంలోని ఓ బావిలో వల్లెపు రాకేష్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. రాకేష్ ఈనెల 12న సినిమాకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, గ్రామంలోని ఓ బావిలో మృతదేహం లభించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News October 15, 2025

కేయూ పరిధిలో డిగ్రీ కోర్సులకు పాత ఫీజులే

image

కేయూ పరిధిలో డిగ్రీ నాన్ ప్రొఫెషనల్ కోర్సులకు 2024-25 ఏడాదికి ఉన్న ఫీజులనే 2025-26 ఏడాదికి కొనసాగుతాయని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం స్పష్టం చేశారు. కామన్ సర్వీస్, పరీక్షల ఫీజులను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ విద్యార్థులకు ఫీజుల విషయాన్ని తెలపాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

News October 15, 2025

అయోమయానికి గురి చేస్తున్న పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. గత వారం రూ. 7వేలకు పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా పడిపోయింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. మంగళవారం రూ.6,960 పలికింది. మళ్ళీ ఈరోజు స్వల్పంగా తగ్గి రూ. 6,940కి చేరినట్లు వ్యాపారస్తులు తెలిపారు.