News October 15, 2025
TU: డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు తేదీని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.కే.సంపత్ కుమార్ మంగళవారం ప్రకటించారు. B.A/B.Com/BSC/BBA/BCA I, III, Vవ సెమిస్టర్(రెగ్యులర్), II,IV,VI సెమిస్టర్ (బ్యాక్లాగ్ 2021-2024) విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. అపరాధ రుసుం రూ.100తో ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉందన్నారు.
Similar News
News October 15, 2025
NZB: మీ పశువులకు టీకాలు వేయించండి

జిల్లాలో గేదెలు, దూడలు, ఆవులు, లేగలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను నేటి నుంచి నవంబర్ 14 వరకు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న 1.97 లక్షల పశువులకు ఏడో విడతలో భాగంగా నెల రోజుల పాటు గ్రామాల్లో ఉచితంగా టీకాలు వేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు టీకాలు వేయించాలని కోరారు.
News October 15, 2025
భీమ్‌గల్: మూడేళ్ల చిన్నారి మృతి (UPDATE)

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ వివరాలు.. రహత్ నగర్‌కు చెందిన శిరీష తన పెద్ద కుమారున్ని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది. ఆ సమయంలో చిన్న కొడుకు శ్రీకాంత్(3) బస్సు ముందుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బాలున్ని బస్సుతో ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు.
News October 15, 2025
NZB: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమానికి చర్యలు

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYD నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు.