News October 15, 2025

SKLM: అధికారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనలు

image

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.

Similar News

News January 8, 2026

ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

image

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.

News January 8, 2026

SKLM: నలుగురు ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేసిన చైర్‌పర్సన్

image

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ గురువారం నియామక పత్రాలు అందజేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతికుమారి (అమలపాడు), కె.పావని (బ్రాహ్మణతర్ల), హెచ్. శాంతిలక్ష్మి (బోరుభద్ర) కే ప్రసాదరావు (గొప్పిలి) పదోన్నతి పొందారు.

News January 8, 2026

SKLM: అంగన్వాడీలో చిన్నారులకు కొత్త మెనూ

image

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న మెనూలో స్వల్పమార్పులు జరిగాయి. కేంద్రాల్లో చిన్నారులకు మంగళ, శనివారాలు ఉదయం ఉడకబెట్టిన శనగలు, మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్‌రైస్ పెట్టాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అన్నం, ఆకుకూరలు, పప్పు, కూరగాయలు, పాలును అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,562 కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వచ్చింది.