News April 8, 2024

గుజరాత్‌లో కాంగ్రెస్ రాత మారేనా?

image

గుజరాత్ అసెంబ్లీలో INC గెలుపు రుచి చూసి 30 ఏళ్లు దాటిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే తీరు కనిపిస్తోంది. అక్కడ 26 MP స్థానాలుండగా, 2014, 19 ఎన్నికల్లో BJP క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి ఆప్‌తో పొత్తు కలిసొస్తుందని INC అంచనా వేస్తోంది. అయితే అది సాధ్యం కాదని 2022 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. అప్పుడు BJPకి 52.50% ఓట్లు రాగా, విడివిడిగా పోటీ చేసిన AAP, INCకి కలిపి 40.2% వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 9, 2024

టాప్-10లోకి దూసుకొచ్చిన అర్ష్‌దీప్

image

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చారు. భారత్ తరఫున అర్ష్‌దీప్ ఒక్కరే టాప్-10లో ఉన్నారు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్య 3, అక్షర్ పటేల్ 11వ స్థానం దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ 2, యశస్వీ జైస్వాల్ 4, రుతురాజ్ గైక్వాడ్ 9వ స్థానంలో ఉన్నారు.

News October 9, 2024

ఈ జిల్లాలకు వర్ష సూచన: APSDMA

image

AP: రేపు అల్లూరి, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది.

News October 9, 2024

జెత్వానీకి ఎస్కార్టు ఎందుకు?: వెల్లంపల్లి

image

AP: దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుపై నిలిపేసి, నటి కాదంబరి జెత్వానీని ఎస్కార్టుతో పంపడం దారుణమని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పవన్ రాకతో సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఉచిత బస్సుల్లో వృద్ధులను ఎక్కించుకోవటం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.