News October 15, 2025
ములుగు: సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీతక్క

ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రామప్ప సరసు నుంచి లక్నవరం నీటి సరఫరాకు, పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందేలా చూడాలన్నారు.
Similar News
News October 15, 2025
అమర్నాథ్‌కు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా?: లోకేశ్

అమర్నాథ్‌పై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. ‘YCP హయాంలో IT మంత్రిని అందరూ ట్రోల్ చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు. ఒక ప్రశ్న అడిగితే కోడి.. గుడ్డు.. గుడ్డు.. కోడి అన్నాడు. అయనకు డేటా సెంటర్ అంటే ఎంటో తెలుసా? గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒక్క గ్లోబల్ కంపెనీ పేరు కూడా చెప్పలేకపోయాడు. డేటా సెంటర్ వలన అనుబంధ సంస్థలు వస్తాయి. దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి’ అని లోకేశ్ పేర్కొన్నారు.
News October 15, 2025
ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్‌లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.
News October 15, 2025
HYD: కనీసం శుభ్రతకు నోచుకోని కలాం విగ్రహం

21వ శతాబ్దపు మహోన్నత వ్యక్తి, అణుశాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి భారతరత్న Dr.APJ అబ్దుల్ కలాం జయంతి నేడు. చిన్నచిన్న గల్లి లీడర్లకు సైతం విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేసే నాయకులు మహోన్నత వ్యక్తి జయంతిని గుర్తుంచుకోకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం రెడ్‌ట్యాంక్ వద్ద ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం కనీసం శుభ్రం చేయడానికి కూడా నోచుకోకపోవడం గమనార్హం