News April 8, 2024
అలంకారప్రాయంగా నల్గొండ ఐటీ హబ్!

నల్గొండలో గత ప్రభుత్వం రూ.74 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ అలంకారప్రాయంగా మారింది. ఐటీ హబ్ నిర్మాణంతో నిరుద్యోగులు సంబర పడిపోయారు. మహానగరాలకు వెళ్లకుండానే స్థానికంగా సాఫ్ట్‌వేర్ కొలువులు లభించనున్నాయని సంతోషపడ్డారు. కానీ.. నేడు కంపెనీలు ముందుకు రాక, ఉద్యోగుల సందడిలేక హబ్ వెలవెలబోతోంది. గతంలో 360 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకుని ప్లేస్‌మెంటు ప్రకటన కాగితాలకే
పరిమితమైంది.
Similar News
News December 31, 2025
NLG: రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ

నల్గొండ జిల్లాలోని రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. 2023 డిసెంబర్ నాటికి కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణణ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మరుసటి నెలలోనే బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన హరిచందన, ఆ తర్వాత నియమించిన నారాయణరెడ్డి కూడా ఎక్కువ కాలం పని చేయలేదు. ఆయన స్థానంలో ఇలా త్రిపాఠి కలెక్టర్‌గా వచ్చిన సరిగ్గా 14 నెలల్లోనే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది.
News December 31, 2025
NLG: ఈ ఉద్యోగానికి సాఫ్ట్‌వేర్ కంటే ఎక్కువే జీతం

జర్మనీ దేశంలోని పేరొందిన ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. 22 నుంచి 38 ఏళ్ల వయసు, బీఎస్సీ నర్సింగ్, GNM, ఒకటి, రెండేళ్లు క్లినిక్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి జర్మన్ భాషలో శిక్షణ అనంతరం నియామకాలు జరుగుతాయన్నారు. నెలకు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించాలి.
News December 31, 2025
NLG: టీఎస్ ఐసెట్ నిర్వహణ MGUకే

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి 2026-27 విద్యా సంవత్సరంలో నిర్వహించే ‘టీఎస్ ఐసెట్-2026 నిర్వాహణ బాధ్యతను నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఐసెట్ కన్వీనర్ గా ఎంజీయూ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్, రిజిస్ట్రార్ ప్రొ. అల్వాల రవిని నియమించారు.


