News October 15, 2025

SCERT పాఠ్యపుస్తక రచనలో చిన్నమల్లారెడ్డి ఉపాధ్యాయుడు

image

కామారెడ్డి(M) చిన్నమల్లారెడ్డి ZPHSలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ TG SCERT 8వ తరగతి ప్రయోగ దీపిక పాఠ్యపుస్తక రచనలో పాల్గొన్నారు. ఇటీవల ఆయన చేసిన పాఠ్యపుస్తక రచన ప్రయోగ దీపిక తయారు కావడం, జిల్లా నుంచి ఏకైక ఉపాధ్యాయుడు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి, ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. విద్యార్థులకు ఉపయోగపడే రచనలలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

Similar News

News October 15, 2025

సిద్దిపేట: బాలికల పాఠశాలల్లో సీట్ల భర్తీకి రేపే లాస్ట్

image

సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లోని బాలికల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు డీసీఓ పోలోజు నరసింహచారి బుధవారం తెలిపారు. సిద్దిపేట రూరల్, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ములుగు సహా 13 మండలాల్లోని బాలికల పాఠశాలల్లో ఈ అవకాశం ఉంది. ఆసక్తి గల విద్యార్థులు సీట్ల కోసం ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

News October 15, 2025

గూగుల్‌తో విశాఖ రూపురేఖలే మారిపోతాయ్: లోకేశ్

image

గూగుల్ డేటా సెంటర్ విశాఖ రూపురేఖలనే మార్చేస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఇది కేవలం డేటా సెంటర్ కాదని.. దీంతో ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖ వస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. నవంబర్‌లోనే టీసీఎస్ వస్తుందని, డిసెంబర్‌లో కాగ్నిజెంట్ పనులు ప్రారంభిస్తుందన్నారు.

News October 15, 2025

అమర్నాథ్‌‌కు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా?: లోకేశ్

image

అమర్నాథ్‌పై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. ‘YCP హయాంలో IT మంత్రిని అందరూ ట్రోల్ చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు. ఒక ప్రశ్న అడిగితే కోడి.. గుడ్డు.. గుడ్డు.. కోడి అన్నాడు. అయనకు డేటా సెంటర్ అంటే ఎంటో తెలుసా? గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌‌‌‌లో ఒక్క గ్లోబల్ కంపెనీ పేరు కూడా చెప్పలేకపోయాడు. డేటా సెంటర్ వలన అనుబంధ సంస్థలు వస్తాయి. దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి’ అని లోకేశ్ పేర్కొన్నారు.