News April 8, 2024

కోవూరు: ఓటర్లు ‘ప్రసన్న’మవుతారా? ప్రశాంతికి ఛాన్సిస్తారా?

image

AP: నెల్లూరు(D) కోవూరు నియోజకవర్గంలో 1952 మినహా అన్ని ఎన్నికల్లోనూ రెడ్డి సామాజికవర్గమే గెలిచింది. INC, TDP చెరో 6సార్లు, YCP 2 సార్లు విజయం సాధించింది. ఈసారి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(YCP), ప్రశాంతిరెడ్డి(TDP) బరిలో దిగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పథకాలు కలిసొస్తాయని ప్రసన్న, బలమైన TDP కేడర్ తనను గెలిపిస్తుందని ప్రశాంతి ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 9, 2024

జెత్వానీకి ఎస్కార్టు ఎందుకు?: వెల్లంపల్లి

image

AP: దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని రోడ్డుపై నిలిపేసి, నటి కాదంబరి జెత్వానీని ఎస్కార్టుతో పంపడం దారుణమని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు జరుగుతున్న తీరు చూస్తుంటే బాధేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘పవన్ రాకతో సాధారణ భక్తులను దర్శనానికి అనుమతించలేదు. ఉచిత బస్సుల్లో వృద్ధులను ఎక్కించుకోవటం లేదు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News October 9, 2024

నైజాంలో ఆల్‌ టైమ్ టాప్-5లోకి ‘దేవర’

image

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ నైజాం ఆల్‌టైమ్ కలెక్షన్ల జాబితాలో 5వ స్థానానికి చేరింది. 12 రోజుల్లోనే ఈ సినిమా రూ.56.07 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక తొలి నాలుగు స్థానాల్లో మూడు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. అగ్రస్థానంలో RRR(రూ.111.85 కోట్లు) ఉంది. తర్వాతి 3 స్థానాల్లో వరసగా కల్కి 2898ఏడీ(రూ.92.80 కోట్లు), సలార్(రూ.71.40 కోట్లు), బాహుబలి 2(రూ.68 కోట్లు) ఉన్నాయి.

News October 9, 2024

అమ్మవారికి పూల దండ.. వేలంలో ఎంత పలికిందంటే!

image

AP: దసరా సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒక్కో చోట ఒక్కో రకమైన ఆనవాయితీ నడుస్తుంటుంది. అంబేడ్కర్ కోనసీమ(D) అమలాపురంలోని రమణం వీధిలో ఏటా అమ్మవారి మెడలో వేసే పూల దండకు వేలం పాట నిర్వహిస్తారు. ఈసారి ఓ భక్తుడు రూ.లక్షా మూడు వేలకు పూల దండను దక్కించుకున్నారు. అమ్మవారి మెడలో దండ వేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 12 ఏళ్ల క్రితం తొలిసారి వేలంపాటలో పూల దండ రూ.5వేలు పలికింది.