News October 15, 2025

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

image

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 332.53 మీటర్లు (80.5 టీఎంసీలు)గా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 22,290 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. 4 గేట్లు తెరిచి సమానంగా 22,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి, కాకతీయ, లక్ష్మీ కాల్వల ద్వారా సాగునీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.

Similar News

News October 15, 2025

గూగుల్ రాక.. CBN అదిరిపోయే ట్వీట్

image

AP: వైజాగ్‌లో <<18002028>>గూగుల్<<>> AI హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. VIZA‘G’లో ఉండే G అంటే ఇప్పుడు గూగుల్ అని పేర్కొన్నారు. ‘యంగెస్ట్ స్టేట్ హై ఇన్వెస్ట్‌మెంట్’ అంటూ హాష్ ట్యాగ్ ఇచ్చారు. గూగుల్ రాకపై ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

News October 15, 2025

అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం వంటి ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్న వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.

News October 15, 2025

సంక్రాంతికి కోనసీమ బీచ్ ఫెస్టివల్: కలెక్టర్

image

అక్టోబరు 15 కోనసీమ బీచ్ ఫెస్టివల్‌ను సంక్రాంతికి అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలు, హోం స్టే విధానాల ప్రదర్శన ప్రధానంగా ఉంటుందని తెలిపారు. బుధవారం ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం నందు ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఫెస్టివల్ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఫెస్టివల్ నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.