News April 8, 2024
కొల్లూరు: కాలి బూడిదైన రూ.3 లక్షల నగదు

విద్యుదాఘాతం వల్ల కౌలు రైతు కుటుంబం సర్వస్వం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన రావుల కిరణ్ బాబు పూరిళ్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు, ఆస్తి పత్రాలు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబం తెలిపింది.
Similar News
News July 5, 2025
గుంటూరు: కానిస్టేబుల్ కుటుంబానికి సహాయం

గుంటూరు జిల్లా 2012 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు రూ.1.35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు తండ్రికి రూ.35 వేలు, సతీమణికి రూ.లక్ష అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ క్రాంతి కుమార్ 2012 బ్యాచ్ సేవా, ఐక్యమత్యాన్ని ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ శాఖ తరఫున కుటుంబానికి అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
News July 5, 2025
తెనాలి: మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

ఇటీవల తగ్గిన కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల కిందట రైతు బజార్లలో కిలో రూ.18 ఉన్న టమాటా శనివారానికి రూ.33కి చేరింది. రిటైల్ మార్కెట్‌లో ఈ ధర మరింత అధికంగా ఉంది. పచ్చిమిర్చి రూ.40, వంకాయ రూ.34, దొండ రూ.36, బెండ రూ.24 పలుకుతున్నాయి. మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News July 4, 2025
GNT: సీలింగ్ భూముల క్రమబద్ధీకరణపై జేసీ సమీక్ష

సీలింగ్ భూములు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన వారు ఈ ఏడాది డిసెంబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సూచించారు. కాంపిటెంట్ అథారిటీ, అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ అధికారులతో కలిసి తహశీల్దార్‌లు, సర్వేయర్‌లతో గుంటూరు కలెక్టరేట్‌లో జేసీ శుక్రవారం సమీక్ష చేశారు. సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ కోసం గతంలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి అధికారులు నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.