News October 15, 2025
నగరిలో దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే.?

గుణశీలన్(65) కుమారుడు <<18008874>>విజయ్ సూసైడ్ <<>>అనంతరం ఆయన పేరుపై ఉన్న రూ.1.25కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు నామినీగా ఉన్న తండ్రి ఖాతాకు జమ అయింది. రూ.10 లక్షలను గుణశీలన్ కౌసల్యకు ఇచ్చాడు. తన కూతురికి తక్కువ ఇచ్చాడని గంగాధరం కక్ష పెంచుకున్నాడు. మరో వ్యక్తి అయ్యప్పన్‌కు గుణశీలన్ రూ.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అతడు నగదు ఇవ్వకుండా మెండికేయడంతో గుణశీలన్ నిలదీశాడు. దీంతో ఇద్దరూ గుణశీలన్ను హత్య చేశారు.
Similar News
News October 15, 2025
MBNR: యూనివర్సిటీని పరిశీలించిన ఎస్పీ

పాలమూరు యూనివర్సిటీలో లైబ్రరీ ఆడిటోరియంలో రేపు 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరు అవుతున్నందున జిల్లా ఎస్పీ డి.జానకి యూనివర్సిటీని ఈరోజు సందర్శించి సమావేశమయ్యే భవనాన్ని పరిశీలించారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో క్యాంపస్ అంతర్గత రోడ్డు మార్గం, వెహికల్ పార్కింగ్ మొదలైన విషయాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రార్ ప్రొ.పి.రమేశ్ బాబు, కంట్రోలర్ డా.కె.ప్రవీణ, డా.కుమారస్వామి ఉన్నారు.
News October 15, 2025
ధాన్యం సేకరణకు అనకాపల్లి జిల్లాలో 63 కేంద్రాలు

అనకాపల్లి జిల్లాలో ఖరీఫ్‌లో ఉత్పత్తి అయ్యే ధాన్యం సేకరణకు 63 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ జాహ్నవి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రాప్ నమోదు ఈనెల 25 నాటికి పూర్తి చేయాలన్నారు. 35 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనికి ఎనిమిది లక్షల గోనె సంచులు అవసరం అవుతాయన్నారు.
News October 15, 2025
610 క్లాప్ వాహనాల ద్వారా చెత్త సేకరణ: జీవీఎంసీ సీఎంవో

ఇళ్ల నుంచి చెత్త సేకరణకు ప్రజలు సహకరించాలని జీవీఎంసీ సీఎంవో నరేష్ కుమార్ కోరారు. పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరిస్తున్నామన్నారు. దీన్ని 100% నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 610 క్లాప్ వాహనాలు, 65 ఇ-ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు.