News October 15, 2025
కోదాడలో అరుదైన శస్త్రచికిత్స.. దూడకు చేప చర్మం

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశువైద్యుడు డా.పెంటయ్య జిల్లాలోనే తొలిసారిగా అరుదైన గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్స చేశారు. ఆటో ఢీకొని కాలికి తీవ్ర గాయమై చర్మం ఊడిపోయిన ఒక గేదె దూడకు ఆయన చేప చర్మాన్ని ఉపయోగించి గ్రాఫ్టింగ్ చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రైతు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ పెంటయ్య చేసిన ఈ అరుదైన వైద్యంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News October 15, 2025
భువనగిరి: దారుణం.. విద్యార్థినిని చితకబాదిన టీచర్

భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది. క్లాస్ టీచర్ ఒక విద్యార్థినిని చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం జోక్యం చేసుకుని, సదరు ఉపాధ్యాయుడితో క్షమాపణ చెప్పించి గొడవ సద్దుమణిగేలా చేసింది. మంచి ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాయని పలువురు జిల్లా వాసులు అంటున్నారు.
News October 15, 2025
కల్తీ మద్యం.. ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు

AP:* క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మాలి
* ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా సీసాపై కోడ్ స్కాన్ చేయాలి
* విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు ప్రతి దుకాణం, బార్ల వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలి
* ప్రతి దుకాణం, బార్‌లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు
* మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా ఎక్సైజ్ శాఖ తనిఖీలు
* నకిలీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు
News October 15, 2025
జగిత్యాల: ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్లతో మంత్రులు, చీఫ్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా మౌళిక వసతులు, గన్నీలు, తూకం, శుద్ధియంత్రాలు అందుబాటులో ఉంచాలని, 421 కేంద్రాల్లో 48 గంటల్లో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు మంత్రులు, అధికారులు సూచించారు.