News October 15, 2025

పంచ భూతాలేనా? ఆరోది కూడా ఉందా?

image

ఈ అనంత విశ్వం పంచభూతాల కలయికతోనే ఏర్పడింది. ఆరో భూతం లేదు. చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఈ 5 శక్తుల ద్వారానే సృష్టిని నడుపుతాడు. భూమి సృష్టికి ఆధారం కాగా, జలం వృద్ధి చేస్తుంది. అగ్ని మార్పును తీసుకురాగా, వాయువు జీవాన్ని ఇస్తుంది, తీసుకుపోతుంది. ఆకాశం సర్వాన్నీ అనుగ్రహిస్తుంది. ప్రజల సుఖ దుఃఖాలు, విశ్వ భవిష్యత్తు ఈ ప్రకృతి శక్తులపైనే ఆధారపడి ఉంటాయనే సత్యాన్ని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు.<<-se>>#SIVOHAM<<>>

Similar News

News October 15, 2025

పత్తి దిగుబడి పెరగాలంటే..

image

ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ తయారీ దశలో ఉంది. మూడు నెలలు పై బడిన పంటకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను పైపాటుగా వేయరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ‘పంటపై 10గ్రా. 13:0:45(మల్టీ-కే) లేదా 19:19:19(పాలిఫీడ్) లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. లేదా 20గ్రా. యూరియాను 10-15రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదల బాగుంటుంది. అధిక దిగుబడి సాధ్యమవుతుంది’ అని పేర్కొంటున్నారు.

News October 15, 2025

₹13వేల కోట్ల పనులకు రేపు ప్రధాని శ్రీకారం

image

AP: PM మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ₹13వేల కోట్ల పనులలో కొన్నింటిని పీఎం ప్రారంభిస్తారని, మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారని CM CBN తెలిపారు. ‘గత పాలకుల తప్పిదాలతో రాష్ట్రం చాలా నష్టపోయింది. వాటిని సరిదిద్దేందుకే చాలా టైం పట్టింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులొస్తున్నాయి. కూటమితో APని మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దుదాం. PM సభను విజయవంతం చేయాలి’ అని కోరారు.

News October 15, 2025

హిందీ మూవీస్‌ బ్యాన్‌కు TN ప్రభుత్వం బిల్లు!

image

తమిళనాడులో హిందీ ఇంపోజిషన్‌ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా హిందీ మూవీస్, సాంగ్స్, హోర్డింగ్స్‌ను బ్యాన్ చేసేందుకు ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయంలో చట్టపరమైన సవాళ్లపై నిన్న రాత్రి సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా ఇది మూర్ఖత్వమని బీజేపీ నేత వినోజ్ సెల్వమ్ మండిపడ్డారు.