News October 15, 2025
భూ సేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలి: కలెక్టర్

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా భూమికి భూమి, కాలనీల నిర్మాణాలు, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు తదితర పనులకు జిల్లాలో 4,434 ఎకరాల భూమి అవసరం ఉందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో గుర్తించిన భూములకు సంబంధించి ఇంకా సేకరణ చేయాల్సిన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.
Similar News
News October 16, 2025
గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News October 16, 2025
రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచేందుకు పసుపు కలిపిన పాలు తాగడం మేలని వైద్యులు చెబుతున్నారు. ఈ పాలను నెలరోజుల పాటు రాత్రిళ్లు తీసుకుంటే ఆరోగ్యకరమని అంటున్నారు. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు, కీళ్లను బలపరచడమే కాకుండా జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా రాత్రి పూట ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది.
News October 15, 2025
పైడితల్లి అమ్మవారి ఆదాయం రూ.50.13లక్షలు

విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి కళ్యాణ మండపంలో బుధవారం లెక్కించారు. హుండీలో రూ.50,13,221 నగదు, 35.3గ్రాముల బంగారం, 421గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ శిరీష చెప్పారు. దేవాదాయ శాఖధికారులు, పోలీసులు సమక్షంలో హుండీని లెక్కించారు. లెక్కింపులో అధికారులు, భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు.