News October 15, 2025
బీమా పొందాలంటే ఈ- పంట, ఈ- కేవైసీ తప్పనిసరి: కలెక్టర్

తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు బీమా, పరిహారం పొందాలంటే ఈ- పంట, ఈ- కేవైసీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. గ్రామ స్థాయిలోని వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించి ఈ పంట ఈ కేవైసీపై అవగాహన కల్పించి పూర్తి చేయాలన్నారు. అటు 1.85 లక్షల ఎకరాలలో వరి సాగు ఉందని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
ఉద్యోగులకు సీపీఆర్‌పై అవగాహన ఉండాలి: డీఎంహెచ్వో

ప్రతి ఉద్యోగికి సీపీఆర్‌పై అవగాహన ఉండాలని డీఎంహెచ్వో గోపాలరావు అన్నారు. ములుగు కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. మనిషికి మానసిక ఒత్తిడి కారణంగా మెదడుకు రక్తప్రసరణ జరగక గుండె కొట్టుకోవడం ఆగిపోతుందన్నారు. అప్పుడు సీపీఆర్ ప్రక్రియ చేయాలని, దీని ద్వారా గుండె కొట్టుకోవడంతో పాటు మనిషి కోలుకోవడానికి సహాయపడుతుందన్నారు.
News October 16, 2025
ఈనెల 25నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి: జేసీ

బాణాసంచా తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా జేసీ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో జేసీ మాట్లాడారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా లోపాలను గుర్తించాలన్నారు. ఓటర్ లిస్టులకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసి మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
News October 16, 2025
గద్వాల్: ‘అక్రమంగా మట్టి తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు’

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మట్టి దందా ఆగడం లేదు. పట్టపగలే అక్రమంగా మట్టిని తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కొందరు ట్రాక్టర్‌ను ఆపి డ్రైవర్‌ను అడగగా రాజకీయ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. రాజకీయ నాయకుల అండతో అక్రమ దందా జోరుగా సాగుతోంది. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.