News October 15, 2025

జూబ్లీహిల్స్‌లో 23 వేల కొత్త ఓట్లపై అనుమానం: BRS

image

జూబ్లీహిల్స్‌లో నకిలీ ఓట్ల వివాదం చిలిచిలికి గాలివానైంది. నకిలీ ఓట్ల విషయమై రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా స్పందన లేదంటూ BRS సీరియస్ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు మెట్లు ఎక్కాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌ నియెజకవర్గంలో 23 వేల కొత్త ఓట్లు నమోదు కావడం అనుమానాస్పదమంటూ, దీనిపై చర్యలు తీసుకునేలా చేయాలని హైకోర్టును ఆశ్రయించనుంది.

Similar News

News October 15, 2025

HYD: బైక్‌ మీద వెళితే.. కుక్కలతో జాగ్రత్త!

image

టూ వీలర్‌పై వెళుతున్నపుడు వాహనం కంట్రోల్‌లో ఉండాలి. కుక్కలు కూడా సిటీలో వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి. వీధి కుక్కలు అప్పుడప్పుడు రోడ్లపై సడన్‌గా బండికి అడ్డంగా వస్తుంటాయి. అప్పుడు బైక్ కంట్రోల్ కాకపోతే ప్రమాదాలకు గురవుతాం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇలా నిన్న తుకారాంగేట్ వద్ద ప్రాణాలు కోల్పోయింది అడ్డగుట్టకు చెందిన స్వప్న (42). భర్తతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సో.. జాగ్రత్త.

News October 15, 2025

HYDలో నాసిరకం నర్సింగ్!

image

నాసిరకం సౌకర్యాలు.. అంతంత మాత్రమే బోధన.. ఇదీ నర్సింగ్ స్కూళ్ల నిర్వాహకుల నిర్వాకం. దీంతో పలువురు నర్సింగ్ స్కూళ్ల వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో నర్సింగ్ కౌన్సిల్ తనిఖీలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కళాశాలలపైనే ఎక్కువగా ఫిర్యాదులందాయి. కమిటీ స్కూళ్లల్లో తనిఖీలు నిర్వహించి సర్కారుకు నివేదిక ఇవ్వనుంది.

News October 15, 2025

రంజీ DAY-1: మ్యాచ్ HYD కంట్రోల్‌లో

image

రంజీ ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లితో HYD నెక్ట్స్ జెన్ స్టేడియంలో తలపడుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన తిలక్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆద్యంతం మనోళ్లు బౌలింగ్‌తో ఎదురుదాడికి దిగారు. టీ బ్రేక్‌కి ఢిల్లీ 55 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తొలుత ఢిల్లి తడబడినా కెప్టెన్ ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్ నిలబెట్టారు. HYD బౌలర్లలో మిలింద్ 2, బి.పున్నయ్య 1 వికెట్ పడగొట్టారు.