News October 15, 2025

సత్తెనపల్లి: కీచక గురువుకు దేహశుద్ధి

image

మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. జెడ్పీ హైస్కూల్ టీచర్ జరార్డ్ బాబు పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై చేయి వేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు గ్రామ పెద్దలతో కలిసి మంగళవారం స్కూల్‌కు వెళ్లి టీచర్‌ను నిలదీస్తూ దేహశుద్ధి చేశారు. డీవైఈవో ఏసుబాబు విచారణ జరిపి ఉపాధ్యాయుడితో రాతపూర్వక క్షమాపణ తీసుకున్నారు.

Similar News

News October 15, 2025

విజయనగరం జిల్లాలో 6,873 గృహ నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

image

PMAY క్రింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్‌లో సొంత స్థలాలు ఉన్న గృహాలను పూర్తి చేయాలన్నారు.

News October 15, 2025

నిర్ధిష్ట సమయంలో రోడ్ల నిర్మాణం: వీఎంఆర్డీఏ ఛైర్మన్

image

మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. అర్హులైన వారికి టీడీఆర్ ఇవ్వాలన్నారు. సమస్యలు లేని చోట్ల రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే <<18005420>>రోడ్డు నిర్మాణం<<>> వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేశ్, సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.

News October 15, 2025

పరిశోధనలే సమాజానికి దిక్సూచి: ఎంజీయూ వీసీ

image

విద్యాలయాలలో జరిగే పరిశోధనలే సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తాయని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. 2028లో జరగనున్న మూడో విడత నాక్ మూల్యాంకనంపై ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పరిశోధనల నాణ్యత పెంచాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు.