News October 15, 2025

విజయవాడ: గేదెలపై పడ్డ దొంగల కళ్లు!

image

ఎన్టీఆర్ జిల్లాలో ఓ దొంగల ముఠా కళ్లు గేదెలపై పడ్డాయి. పాలు, వాటి అనుబంధ పదార్థాల ధరలు పెరగడంతో గేదెల విలువ బాగా పెరిగింది. రూ.లక్ష వరకు ధర ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓ ముఠా గేదెలు ఎత్తుకుపోతోంది. బొలేరో, టాటా ఏస్‌ వంటి వాహనాల్లో వచ్చి గేదెలను అందులోకి ఎక్కించి దొంగిలించుకుపోతున్నారు. ఈ క్రమంలో విజయవాడ CCS పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఠా మొత్తాన్ని పట్టుకునే పనిలో పడ్డారు.

Similar News

News October 15, 2025

గద్వాల: ‘విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి’

image

విద్యార్థులకు అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాలు బోధించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం బురదపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతిరోజు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఆ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో గద్వాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.

News October 15, 2025

NZB: విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకూడదు: కలెక్టర్

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రైవేటు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.

News October 15, 2025

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి: NZB కలెక్టర్

image

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పాలన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపి మాట్లాడారు. అర్జీలను త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామ స్థాయిలో జీపీఓలు కీలక బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.