News April 8, 2024
HYD: లింక్ ఓపెన్ చేశాడు.. రూ.16 లక్షలు స్వాహా
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16 లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యక్తి ఫేస్ బుక్‌లో యాడ్ చూసి, అందులో ఉన్న లింక్ ఓపెన్ చేశాడు. విడతల వారీగా రూ.16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఆ డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి వాటికి అడిక్ట్ కావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News November 25, 2024
HYD: లోక్‌మంథన్ ఫెస్టివల్ ఘనంగా ముగింపు
శిల్పకళ వేదికలో లోక్‌మంథన్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. వనవాసి గ్రామవాసి, నగరవాసి అందరూ భారతీయులే అని తెలిపారు. దేశ సంస్కృతి ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శించారని చెప్పారు. దేశంలో స్వార్థం ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్‌రెడ్డి, గజేంద్ర శెఖావత్ పాల్గొన్నారు.
News November 25, 2024
HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD
HYDలో జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఈ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలను కోరారు.
News November 25, 2024
HYD: అక్రమ కనెక్షన్లపై ఫిర్యాదు చేయండి: MD
HYDలో జలమండలి అధికారుల నుంచి అనుమతి లేకుండా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపులైన్ కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. అక్రమ నల్లా, సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే.. జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 నంబర్ల ద్వారా సమాచారం అందించాలని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలకు సూచించారు.