News October 15, 2025

అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి

image

బొబ్బిలి మండలం కృపావలసకు చెందిన గిరిజన విద్యార్థిని తాడంగి పల్లవి (11) అనారోగ్యంతో ఈనెల 12న విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. పల్లవి సాలూరు మండలం మామిడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చి అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం మృతి చెందింది. మృతి విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. కుమార్తె మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

Similar News

News October 16, 2025

వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు: నిర్మల్ కలెక్టర్

image

వర్షాకాలం నిర్మల్‌లో వరద నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి పట్టణంలో వరద నీటి నియంత్రణపై సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎక్కువగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నిల్వ ఉండకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని తెలిపారు.

News October 16, 2025

రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు: NPDCL సీఎండీ

image

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని NPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. హన్మకొండలోని NPDCL కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సర్వీసుల మంజూరుపై కమర్షియల్ విభాగం, 16 సర్కిళ్ల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News October 16, 2025

కర్నూలులో మొట్టమొదటి ఈ-కోర్ట్ ప్రారంభం

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కర్నూలులో ఈ-కోర్ట్ ఏర్పాటు చేశారు. దీనిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. వైద్యులు, సిబ్బంది ఇక్కడి నుండే రాష్ట్రంలో ఏ కోర్టుకైనా సాక్ష్యాన్ని అందించవచ్చని చెప్పారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.