News October 15, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో NOV 6 ఉ.7 గంటల నుంచి 11 సా. 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇది TV, రేడియో, పత్రికలు, SM, డిజిటల్ ప్లాట్‌ఫామ్ వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి చట్టప్రకారం రెండేళ్ల జైలు/జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. కాగా NOV 11న పోలింగ్ జరగనుంది.

Similar News

News October 15, 2025

అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

image

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

News October 15, 2025

పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

image

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్‌’ స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్‌కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

News October 15, 2025

రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

image

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.