News October 15, 2025

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: దుద్దళ్ల

image

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు.

Similar News

News October 15, 2025

హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన ఎస్పీ

image

జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే సురేష్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల న్యాయమూర్తి సుబ్బారెడ్డి బుధవారం ఏలూరులో పర్యటించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు న్యాయమూర్తులకు ఏలూరు అతిథి గృహం వద్ద ఘన స్వాగతం పలికి పూలగుత్తి అందించారు. పోలీసు సిబ్బంది వారికి గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు.

News October 15, 2025

దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడి మృతి

image

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకి చెందిన యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల ప్రకారం.. యువకుడు బిట్ల తేజ(24) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తేజ దుబాయ్‌లో షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. తిరిగి రూంకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబీకులకు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.

News October 15, 2025

విజయవాడలో స్టెరాయిడ్స్ కలకలం

image

విజయవాడలో బుధవారం స్టెరాయిడ్స్ కలకలం రేగింది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ ట్రైనర్ వద్ద స్టెరాయిడ్స్‌ను సుమారు 10 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.