News October 15, 2025
తెనాలిలో హెచ్చుమీరుతున్న నేరాలు…(2/2)

తెనాలి చెంచుపేటలో మంగళవారం పట్టపగలే హోటల్ వద్ద టిఫిన్ తింటున్న కోడితాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావుని పాత కక్షలతో దారుణంగా హత్య చేశారు. ఇలా వరుస హత్యోదంతాలతో పాటు తరచూ జరుగుతున్న చోరీలు, కొట్లాటలు తెనాలి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మళ్లీ అదే తరహాలో నేర తీవ్రతను తగ్గించడానికి పోలీసులు నిఘా మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News October 15, 2025
మంగళగిరి: పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన

దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న నిర్వహించబోతున్న పోలీసు అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను మంగళగిరి ఏపీఎస్‌పీ 6 బెటాలియన్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం పరిశీలించారు. భద్రత, అమరవీరుల స్తూపం, స్టేజి నిర్మాణం, పరేడ్ స్థలాలను బెటాలియన్ ఇన్‌ఛార్జ్ కమాండెంట్ ఏ.మురళీ ఎస్పీకి వివరించారు. సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు.
News October 15, 2025
తెనాలిలో పెరుగుతున్న క్రైమ్ రేటు!(1/2)

ప్రశాంతంగా ఉంటున్న తెనాలిలో పరిస్థితి 3 మర్డర్లు..6 చోరీలు అన్నట్లుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. గత 7 నెలల కాలంలో వేర్వేరు కారణాలతో ఏడుగురు హతమయ్యారు. చెంచుపేటలో ఇవాళ జరిగిన హత్య లాగానే కొన్ని నెలల క్రితం పండ్ల వ్యాపారిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. తర్వాత ముత్తింశెట్టిపాలెంలో మహిళ హత్య, పరిమి రోడ్డులో డబుల్ మర్డర్, పినపాడులో ఒకటి, వార్ఫ్ రోడ్డులో ఇంకో హత్య జరిగాయి.
News October 15, 2025
గుంటూరు: ఆటో డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ కోటి వెంకట రెడ్డికి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంగళవారం 3 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు సాక్ష్యాలను సమర్పించడంతో నిందితుడు దోషిగా తేలాడు. విచారణలో ఎస్ఐ అమీర్, ఏపీపీ శౌరి కృషి చేశారు. ఎస్పీ పోలీసులను అభినందించారు.