News October 15, 2025
కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలకు ఆయనే కారణమా?

మంత్రి కొండాసురేఖ OSDసుమంత్‌ను పీసీబీ టర్మినేట్ చేయగా.. దేవాదాయ, అటవీశాఖ విభాగాల పరిపాలనలో తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి కాంట్రాక్ట్ పనులను అప్పగించడంలో సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య విభేదాలు సృష్టించడంలో సుమంత్ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాగా DEC 2023లో OSDగా నియమితులైన సుమంత్ కాంట్రాక్టును 2025చివరివరకు పొడిగించగా తాజాగా వేటుపడింది.
Similar News
News October 16, 2025
వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు: నిర్మల్ కలెక్టర్

వర్షాకాలం నిర్మల్‌లో వరద నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో కలిసి పట్టణంలో వరద నీటి నియంత్రణపై సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఎక్కువగా వర్షపు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించామన్నారు. భవిష్యత్తులో రోడ్లపై నిల్వ ఉండకుండా పటిష్ఠ చర్యలు చేపడతామని తెలిపారు.
News October 16, 2025
రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు: NPDCL సీఎండీ

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందిస్తున్నామని NPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. వ్యవసాయ సర్వీసుల మంజూరు యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. హన్మకొండలోని NPDCL కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సర్వీసుల మంజూరుపై కమర్షియల్ విభాగం, 16 సర్కిళ్ల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
News October 16, 2025
కర్నూలులో మొట్టమొదటి ఈ-కోర్ట్ ప్రారంభం

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా కర్నూలులో ఈ-కోర్ట్ ఏర్పాటు చేశారు. దీనిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్ గురువారం ప్రారంభించారు. వైద్యులు, సిబ్బంది ఇక్కడి నుండే రాష్ట్రంలో ఏ కోర్టుకైనా సాక్ష్యాన్ని అందించవచ్చని చెప్పారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు.