News October 15, 2025

మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

image

ధన త్రయోదశి(OCT 18) సమీపిస్తున్న వేళ బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,28,890కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రా.ల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.1,18,150గా ఉంది. అలాగే KG వెండిపై రూ.1,000 ఎగబాకి రూ.2,07,000కు చేరింది. గత 10 రోజుల్లోనే వెండిపై రూ.42వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

Similar News

News October 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

▸సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్న మహేశ్ బాబు
▸వెట్రిమారన్, శింబు కాంబోలో వస్తోన్న ‘అరసన్'(తెలుగులో సామ్రాజ్యం) సినిమా ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్న Jr.NTR
▸విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం?
▸ మెటా AIకి దీపికా పదుకొణె వాయిస్.. తొలి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు

News October 16, 2025

PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

image

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.

News October 16, 2025

3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు.. ఇక్కడే

image

TG: జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కాలేజీలను నిర్మించనుంది. అటు రూ.10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.