News October 15, 2025
ఖమ్మం: మక్కల కొనుగోళ్లకు రెడీ..!

ఉమ్మడి ఖమ్మంలో మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించనుంది. ఉమ్మడి జిల్లాలో 98,554 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 96,864, ఖమ్మంలో 1,690 ఎకరాల్లో సాగు చేశారు. భద్రాద్రిలో 20, ఖమ్మంలో మూడు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. గత ఏడాది క్వింటా మొక్కజొన్నలకు రూ.2,225 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది కేంద్రం రూ.2,400గా ప్రకటించింది.
Similar News
News October 16, 2025
ఇదే నాకు చివరి దీపావళి: యువకుడి ఎమోషన్

తనపై క్యాన్సర్ గెలిచిందని ఓ యువకుడు(21) Redditలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘2023లో పెద్దపేగు క్యాన్సర్ అని తెలిసి ఎన్నో రోజులు ఆస్పత్రిలో కీమోథెరపీ చికిత్స తీసుకున్నా. స్టేజ్4లోని నేను ఇంకో ఏడాదే ఉంటానని డాక్టర్లు చెప్పారు. వీధుల్లో దీపావళి సందడి కన్పిస్తోంది. నాకు ఇవే చివరి వెలుగులు, నవ్వులు. నా జీవితం, కలలు కరిగిపోతున్నాయనే బాధ కుటుంబంలో చూస్తున్నా’ అని చేసిన పోస్ట్ ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది.
News October 16, 2025
జిల్లాలో పనులు త్వరగా పూర్తిచేయాలి: ఫైజాన్ అహ్మద్

జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, EGS నిధుల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీల్లో మరుగుదొడ్ల నిర్మణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News October 16, 2025
జగిత్యాల : మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఈ నెల 18, 20, 21 తేదీల్లో దీపావళి సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి తెలిపారు. కావున రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్ యార్డుకు సరుకులు తీసుకు రాకూడదని పేర్కొన్నారు. తిరిగి ఈనెల 22 నుంచి మార్కెట్ యార్డులో క్రయ, ఎకరాలు యధావిధిగా జరుపబడునని అన్నారు.