News October 15, 2025
రబీలో మేలైన ‘కంది’ రకాలివే..

తెలుగు రాష్ట్రాల్లో వర్షం, నీటి సదుపాయాన్ని బట్టి రబీలో కందిని ఈ నెలాఖరు వరకు సాగుచేసుకోవచ్చు. TGలో WRG-65, WRG-53, WRG-255, TDRG-59, LRG-41, ICPL-87119, ICPH-2740, TDRG-4 రకాలు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎకరానికి 5-6KGలు విత్తుకోవచ్చని తెలిపారు. ఆఖరి దుక్కిలో 20KGల నత్రజని, 50KGల భాస్వరంను వేయాలి, పైరు 30-40 రోజుల మధ్యలో మరో 20KGలను పైపాటుగా వేయాలని సూచిస్తున్నారు.
#ShareIt
Similar News
News October 15, 2025
2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం

కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది. 2030లో జరిగే ఈ క్రీడలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. 2010లో భారత్ తొలిసారి కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఈ క్రీడలకు వేదిక కానుంది. కాగా అహ్మదాబాద్‌ను కామన్‌వెల్త్ బోర్డు వేదికగా ప్రతిపాదించింది. దీనిపై వచ్చే నెల 26న తుది నిర్ణయం ప్రకటించనుంది.
News October 15, 2025
ట్యాబ్లెట్లతో మైగ్రేన్‌ను ఆపాలనుకుంటున్నారా?

మైగ్రేన్ సమస్య ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తోంది. ఈ తలనొప్పి జీవిత నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో నెలకు మూడు సార్లకంటే ఎక్కువ మైగ్రేన్ ట్యాబ్లెట్స్ వాడొద్దని ప్రముఖ న్యూరో డాక్టర్ సుధీర్ తెలిపారు. ‘తరచుగా వాడితే తలనొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్‌ను అదుపులో ఉంచుకునేందుకు వైద్యుడిని సంప్రదించండి. తక్షణ మందులకు బదులు నివారణ చికిత్స గురించి సలహా తీసుకోండి’ అని తెలిపారు.
News October 15, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్‌ఫైర్.. అడుక్కున్న పాకిస్థాన్!

పాకిస్థాన్-అఫ్గాన్ కాల్పుల విరమణ(సీజ్‌ఫైర్)కు అంగీకరించాయి. 48 గంటల పాటు ఇది అమల్లో ఉండనుంది. పాక్ ఆర్మీ సీజ్‌ఫైర్ కోసం అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని అడుక్కున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య జరిగిన <<18012870>>ఘర్షణల్లో<<>> పాక్ సైనికులతో పాటు అఫ్గాన్ సోల్జర్స్, TTP ఫైటర్లు, అమాయక ప్రజలు మరణించారు. కాగా ఆపరేషన్ సిందూర్‌తో భారీగా నష్టపోయిన పాక్.. భారత్‌ను సీజ్‌ఫైర్ కోసం అభ్యర్థించిన సంగతి తెలిసిందే.