News October 15, 2025
గ్రేటర్ విజయవాడ సాధ్యమయ్యేనా..?

విజయవాడ కార్పొరేషన్‌ను గ్రేటర్ విజయవాడగా మార్చాలని 2017లోనే ప్రతిపాదించారు. విజయవాడకు ఆనుకుని ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గంలోని 45-50 గ్రామాలను గ్రేటర్లో కలపాలని ప్రణాళిక వేశారు. నగర విస్తరణ 62KM నుంచి 165KM చేరుకుంటుంది. అయితే అడుగు ముందుకు పడలేదు. ప్రస్తుతం గ్రేటర్ విజయవాడ కంటే అమరావతికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పట్లో గ్రేటర్ విజయవాడ కల నెరవేరేలా కనిపించడం లేదు.
Similar News
News October 15, 2025
హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన ఎస్పీ

జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే సురేష్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల న్యాయమూర్తి సుబ్బారెడ్డి బుధవారం ఏలూరులో పర్యటించారు. ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు న్యాయమూర్తులకు ఏలూరు అతిథి గృహం వద్ద ఘన స్వాగతం పలికి పూలగుత్తి అందించారు. పోలీసు సిబ్బంది వారికి గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు.
News October 15, 2025
దుబాయ్‌లో సిరిసిల్ల యువకుడి మృతి

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకి చెందిన యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. గ్రామస్థుల ప్రకారం.. యువకుడు బిట్ల తేజ(24) బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తేజ దుబాయ్‌లో షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. తిరిగి రూంకు రాకపోవడంతో స్నేహితులు కుటుంబీకులకు అనుమానాస్పందంగా మృతి చెందినట్లు తెలిపారు. బుధవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది.
News October 15, 2025
విజయవాడలో స్టెరాయిడ్స్ కలకలం

విజయవాడలో బుధవారం స్టెరాయిడ్స్ కలకలం రేగింది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ ట్రైనర్ వద్ద స్టెరాయిడ్స్‌ను సుమారు 10 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.