News October 15, 2025

శ్రీశైలం రహదారిపై రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు, వాహనదారులు సహకరించాలని కోరారు.

Similar News

News October 15, 2025

రానున్న 3 గంటల్లో సత్యసాయి జిల్లాలో భారీ వర్షం

image

రానున్న 3 గంటల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చెట్ల కింద ఎవరూ నిలబడకూడదని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జిల్లాలోని హిందూపురం, సోమందేపల్లి తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం పడుతోంది.

News October 15, 2025

కళింగపట్నం బీచ్‌లో ఆకట్టుకున్న GST సైకత శిల్పం

image

సిక్కోలు జిల్లా కళింగపట్నం బీచ్‌లో ఏర్పాటు చేసిన జీఎస్టీ (GST) అంశంపై సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంటోంది. స్థానిక కళాకారుడు ఇసుకతో తీర్చిదిద్దిన ఈ శిల్పం, ప్రజల్లో పన్నుల వ్యవస్థపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులు ఈ శిల్పం వద్ద ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు.

News October 15, 2025

ఓ టెకీ.. నీ శరీరం కోరుకుంటోందిదే!

image

స్తంభించిన జీవనశైలితో ఎంతో మంది టెకీలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ‘నేచర్ సైన్స్ రిపోర్ట్స్’ అధ్యయనంలో తేలింది. ‘సమయానికి ఆహారం ఇవ్వవు. ఇచ్చినా ప్రాసెస్ చేయలేని జంక్ ఇస్తావ్. నిద్రలేక నేను కూడా అలసిపోయాను. నా మాటే వినకపోతే, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది’ అని టెకీ శరీరం హెచ్చరిస్తోంది. అందుకే ఇకనైనా రోజూ వ్యాయామం, నడకతో పాటు సరైన నిద్రాహారాలు ఉండేలా చూసుకోండి. SHARE IT