News October 15, 2025
NLG: నిమ్మ ధరల పతనంతో రైతుల బేజారు

నిమ్మ ధరలు భారీగా తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సూమారు 30వేల ఎకరాలకు పైగానే నిమ్మ తోటలున్నాయి. దాదాపు 20 వేల రైతు కుటుంబాలు, కౌలుదారుల కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏటా మూడు లక్షల టన్నులకు పైనే నిమ్మ దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఒక బస్తా పండు కాయలు రూ.70 నుంచి 100లు, పచ్చికాయలు రూ.100 నుంచి 200కు మించి పలకడం లేదు.
Similar News
News October 16, 2025
సంగారెడ్డి: ‘రేపటి నుంచి పాఠశాలలో స్వచ్ఛత పక్వాడ’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపటి నుంచి ఈనెల 31 వరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. రోజు ఒక కార్యక్రమం నిర్వహించాలని దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.
News October 16, 2025
8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్‌ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.
News October 16, 2025
విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.