News October 15, 2025
ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

ఆలమూరు మండలం చిలకలపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కామరాజు తన ఇద్దరు కుమారులు అభిరామ్ (10), గౌతమ్ (7) లను చంపి, అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యాసాగర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 16, 2025
సంగారెడ్డి: ‘రేపటి నుంచి పాఠశాలలో స్వచ్ఛత పక్వాడ’

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రేపటి నుంచి ఈనెల 31 వరకు స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. రోజు ఒక కార్యక్రమం నిర్వహించాలని దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.
News October 16, 2025
8th పే కమిషన్ సిఫార్సులు మరింత ఆలస్యం!

కేంద్ర ప్రభుత్వ 8th పే కమిషన్ సిఫార్సులు ఆలస్యం కావొచ్చు. కమిషన్‌ను కేంద్రం JANలో ప్రకటించినా విధివిధానాలు తేల్చలేదు. పదేళ్లకోసారి ఉద్యోగుల జీతాలు సవరించాలి. 7th పే కమిషన్ 2014లో ఏర్పాటు కాగా సిఫార్సులు 2016లో అమల్లోకొచ్చాయి. ప్రస్తుత కమిషన్ సిఫార్సులు 2026లో అమల్లోకి రావాలి. కానీ 2027లో కూడా అమలు కాకపోవచ్చని ‘కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ పేర్కొంది. ఫిట్మెంటు 1.8xగా ఉండొచ్చని అంచనా వేసింది.
News October 16, 2025
విశాఖలో ₹1,222 కోట్లతో లులు ప్రాజెక్టు

AP: విశాఖకు AI హబ్, డిజిటల్ డేటా సెంటర్ రానుండడంతో ‘లులు’ తన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రెడీ అవుతోంది. రూ.1,222 కోట్లతో హార్బర్ పార్కు వద్ద 13.74 ఎకరాల్లో వచ్చే ఈ ప్రాజెక్టులో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్, లులు కనెక్ట్, ఫన్ టూర్ వంటివి ఉంటాయి. దీనికి ప్రభుత్వం పలు రాయితీలిస్తోంది. ఇటీవల క్యాబినెట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపినా ప్రభుత్వం సవరించిన నిబంధనలకు ఓకే చెప్పింది.