News October 15, 2025

అయోమయానికి గురి చేస్తున్న పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురిచేస్తున్నాయి. గత వారం రూ. 7వేలకు పైగా పలికిన పత్తి ధర ఈ వారం భారీగా పడిపోయింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,930 పలకగా.. మంగళవారం రూ.6,960 పలికింది. మళ్ళీ ఈరోజు స్వల్పంగా తగ్గి రూ. 6,940కి చేరినట్లు వ్యాపారస్తులు తెలిపారు.

Similar News

News October 15, 2025

నిర్మల్ కలెక్టరేట్లో టీకాల కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ

image

పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్మూలన టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తన ఛాంబర్‌లో పశు వైద్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. నేటి నుంచి నెల రోజుల పాటు చేపట్టబోయే ఉచిత గాలికుంటు వ్యాధి నిర్మూలన టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 15, 2025

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

image

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.

News October 15, 2025

గూగుల్ రాక.. CBN అదిరిపోయే ట్వీట్

image

AP: వైజాగ్‌లో <<18002028>>గూగుల్<<>> AI హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. VIZA‘G’లో ఉండే G అంటే ఇప్పుడు గూగుల్ అని పేర్కొన్నారు. ‘యంగెస్ట్ స్టేట్ హై ఇన్వెస్ట్‌మెంట్’ అంటూ హాష్ ట్యాగ్ ఇచ్చారు. గూగుల్ రాకపై ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.