News October 15, 2025
సైదాపూర్: బావిలో యువకుడి మృతదేహం లభ్యం

KNR(D) సైదాపూర్ మండలం గోడిశాల గ్రామంలోని ఓ బావిలో వల్లెపు రాకేష్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. రాకేష్ ఈనెల 12న సినిమాకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, గ్రామంలోని ఓ బావిలో మృతదేహం లభించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
నిర్మల్ కలెక్టరేట్లో టీకాల కార్యక్రమ పోస్టర్ల ఆవిష్కరణ

పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నిర్మూలన టీకాల కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తన ఛాంబర్‌లో పశు వైద్య శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. నేటి నుంచి నెల రోజుల పాటు చేపట్టబోయే ఉచిత గాలికుంటు వ్యాధి నిర్మూలన టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 15, 2025
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
News October 15, 2025
గూగుల్ రాక.. CBN అదిరిపోయే ట్వీట్

AP: వైజాగ్‌లో <<18002028>>గూగుల్<<>> AI హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. VIZA‘G’లో ఉండే G అంటే ఇప్పుడు గూగుల్ అని పేర్కొన్నారు. ‘యంగెస్ట్ స్టేట్ హై ఇన్వెస్ట్‌మెంట్’ అంటూ హాష్ ట్యాగ్ ఇచ్చారు. గూగుల్ రాకపై ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.